Thursday, May 27, 2010

విత్తన శుద్దితో లాభాలు అనేకం

చాలా మంది రైతులు పంట కాలంలో వచ్చే పురుగు తెగుళ్ళ నివారణకు అనేక రకాల మందులు అధిక ధరలు పెట్టి కొని, వాడటం ఆనవాయితీ. ఈ ప్రకారం చేస్తూ పెట్టుబడులను అధికం చేసుకుంటున్నారు. పురుగు, తెగుళ్ళపై ఏమాత్రం అవగాహన లేకుండా మందుల కొట్టు వాళ్ళు చెప్పే సలహాలను పాటిస్తుంటారు. ఇది అంగళ్ళ వాళ్లకు మేలు చేస్తుంది తప్ప రైతుకు కాదు. కాబట్టి మనం మన పంటపై అవగాహనతో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఎంతైనా మంచిది. గతంలో మన పంటలకు సోకిన పురుగు తెగుల్లాను గుర్తుచేసుకుని, దానికి తగిన విదంగా ఈ పంట కాలంలో విత్తనసుద్ది చేసుకున్నట్టయితే,   మందులపై  ఖర్చు  గణనీయంగా తగ్గించుకోవచ్చు.   వివిధ పంటలలో విత్తనసుద్ది ఈ క్రిందివిధంగా చేసుకోవచ్చు.
౧. వరిలో అగ్గి తెగులుకు  - ౧ కిలో విత్తనానికి ౨ గ్రాముల కార్బండిజం
౨. వేరు శనగలో  తెగుల్లకు - ౧ కిలో విత్తనానికి ౩ గ్రాముల మంకోజెబ్